Skip to main content

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 1)



యూపిఎస్సి ప్రేపరషన్ మొదలు పెట్టె ముందు మనకి ఎం చదవాలో తెలియాలి. నేను అయితే ఇవేమి తెలుసుకోకుండా డైరెక్ట్ గా " Laxmikant Polity " బుక్ కొనేసి చదవడం మొదలుపెట్టా. ఒక్కటి కూడా అర్ధం అవ్వలేదు. కాబట్టి ఎం చదవాలో మాత్రమే కాదు దేని తరువాత ఎం చదవాలో కూడా బాగా తెలిసి ఉండాలి. ఆ తరువాత తెలుసుకోవాల్సింది ఎలా చదవాలి అని. మూడోది పక్కన పెట్టి మొదటి రెండు వాటి  మీద focus చేద్దాం. ఎందుకంటే ఇది Beginner సిరీస్  కాబట్టి అండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే...
నేను కూడా మరీ senior aspirant ని అయితే కాదు కాబట్టి నాకు తెల్సినంత వరకు నేను ఏమి చేస్తానో, ఎలా చేస్తానో, లేకపోతే ఎలా చేసానో, ఎందుకు ఆలా చేసానో,ఎందుకు ఆలా చేసి తప్పు చేసానో ఇవి మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. మీలో ఎవరికైనా ఇవి తప్పు అని అనిపిస్తే గుర్తుంచుకోండి ఇది నేను ఫాలో అయ్యే strategy. ఎక్కడ కూడా ఇలా మాత్రమే చెయ్యండి అని mention చేయట్లా

The First Step

మీరు UPSC కి ప్రిపేర్ అవుదాం అని decision తీసుకున్న తరువాత చెయ్యవలసిన మొదటి పని Exam Pattern and Syllabus along with Eligiblity Criteria గురించి బేసిక్ knowledge సంపాదించుకోవడం.నా Instagram Studygram కి మెసేజ్ చేసినవాళ్లలో చాలా మంది మైన్స్ లో ఎన్ని పేపర్స్ ఉంటాయి లేకపోతే eye sight ఉంటె eligible ఆ కాదా... ఇలాంటి డౌట్స్ తోనే ప్రేపరషన్ స్టార్ట్ చేసారు. కాబట్టి మీరు అటు ఇటు వెళ్లకుండా తిన్నముగా UPSC Official Website లోకి వెళ్లి recent notification ని డౌన్లోడ్ చేసుకోండి.

Download here: UPSC 2021 Notification

ఈ PDF లో మీకు కావాల్సిన Age Eligibility, EyeSight, No of Attempts, Physical Requiremnts ఇలా అన్నింటికీ సంబంధించిన సమాచారం దొరుకుతుంది. 


తరువాత మీరు చూడాల్సింది Exam Pattern. ఎన్ని పేపర్స్ ఉంటాయి,ఎన్ని మర్క్స్ కి ఉంటాయి ఇవన్నీ మీరు ఈ నోటిఫికేషన్ చదివి తెలుసుకోవచ్చు. అవన్నీ నేను ఇక్కడ explain చెయ్యచ్చు.కాని మీకు మీరు గ అన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడి నుండే మొదలుపెట్టాలి.మనకి ఎవరో వచ్చి చెప్తారు అని ఎదురు చూడడం అనవసరం. మీకు చదివాకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటె మీరు ఇక్కడ అడగొచ్చు.

                          

 Video లో కూడా క్లుప్తం గ చెప్పడం జరిగింది.



 ఇక్కడితో మీకు exam రాయాలి అంటే eligibility criteria ఏంటో మరియు exam అనేది ఎలా ఉంటాదో తెల్సింది. తరువాత మీరు చెయ్యాల్సింది Syllabus తెలుసుకోవడం. అదే PDF లో మీకు సిలబస్ అనేది కనిపిస్తుంది. కానీ మీరు దానితో పాటు చెయ్యాల్సింది Previous Years Papers అనేవి చూడడం. సిలబస్ ని వాటిని compare చేసుకుంటూ ఒక question అనేది ఏ level లో అడుగుతున్నారు అనేది మనకి తెలియాలి. UPSC ఎక్సమ్ యొక్క depth  అనేది మనం అర్ధం చేసుకోవాలి. ఇది ఇక్కడితో కాదు మీరు exam attempt ఇచ్చేవరకు కూడా PYQs అనేవి మనకి ఇదొక విధం గ ఉపయోగపడతాయి. 

Links for Buying Books:

Previous Years Papers- Prelims

Previous Years Papers- Mains

నేను కొన్న బుక్స్ అయితే ప్రిలిమ్స్ కి దిశా మరియు మైన్స్ కి అరిహంత్. మీకు ఇంకేమైనా బుక్స్ తెలిస్తే అవి చదివిన పర్లేదు.

ఒకవేళ మీరు బుక్స్ కొనుక్కోలేము అనుకుంటే గనుక మొబైల్ లోనే చదువుకోవచ్చు.PDF లకి  ఇస్తున్న కింద కొంచెం టైం పట్టిన సరే ఒకదాని తరువాత ఒకటి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు.

Previous Years Papers 

నేను అన్ని years పేపర్స్ లో వెతుక్కోలేను అనుకుంటే  గనుక కింద లింక్ ట్రై చెయ్యండి.

Previous Years Papers- Easy

 ఈ పోస్ట్ ఇంతటితో సమాప్తం. తరువాతి పోస్ట్ లో రంగం లోకి ఎలా దిగాలి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం 🙏

Comments లో సలహాలు సూచనలు ఇవ్వడం మరువద్దు.

Youtube ఛానల్ ని subscribe చెయ్యడం అంతకన్నమరువద్దు.




Comments

Post a Comment

Popular posts from this blog

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 2)

 సిలబస్ తెలుసుకున్నాం , ఎక్సామ్ పాటర్న్ తెలుసకున్నాం, మనం eligible  అవతమో లేదో  తెలుసుకున్నాం. ఇక చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే  Foundation  స్ట్రాంగ్ చేసుకోవడం. మనకి తెల్సిందే  ఏదైనా  గట్టిగా నిలబడలంటే ముంద గతిగా ఉండాల్సింది foundation . యూపిఎస్సి పరేపరతివం లో చాలా చదువుతాం చాలా నేర్చుకుంటాం కానీ అన్నింటికీ basic  మాత్రం  ncert's. అసలు ఏంటి ఈ ncert 's ? మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివిన బుక్స్ ఏ కదా  అని అనుకోవచ్చు కానీ మనం చదివినది state సిలబస్. ఇది నేషనల్ సిలబస్. దీంట్లో 6th  క్లాస్ లో ఉండే చాలా విషయాలు మనం 10 th  క్లాస్ వరకు చదివన బుక్స్ లో ఎక్కడ ఉండవు కొన్ని. కాబట్టి ncerts చదవడం చాలా   important .    సరే. ఎన్ని బుక్స్ చదవాలి? అన్నీ బుక్స్ చదివేయాల? ఎ ఎ క్లాస్ లవి చదవాలి అన్న డౌట్ వచ్చి ఉంటది  కచ్చితంగా. దీని గురించే ఇపడు మనం తెలుసుకుందాం .  మొత్తం మన చదవల్సిన సుబ్జెక్ట్స్  1. జియోగ్రఫీ - Geography 2. హిస్టరీ - History 3. రాజనీతి శాస్త్రం - Political Science  4. ఎకనమిక్స్ - Economics 5. సోషియాలజీ - Sociology 6 ఎన్విరాన్మెంట్ - Environment 7. ఆర్ట్ అండ్ కల్చర్ - Art and Cult