Skip to main content

Posts

Showing posts from July, 2021

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 1)

యూపిఎస్సి ప్రేపరషన్ మొదలు పెట్టె ముందు మనకి ఎం చదవాలో తెలియాలి. నేను అయితే ఇవేమి తెలుసుకోకుండా డైరెక్ట్ గా " Laxmikant Polity " బుక్ కొనేసి చదవడం మొదలుపెట్టా. ఒక్కటి కూడా అర్ధం అవ్వలేదు. కాబట్టి ఎం చదవాలో మాత్రమే కాదు దేని తరువాత ఎం చదవాలో కూడా బాగా తెలిసి ఉండాలి. ఆ తరువాత తెలుసుకోవాల్సింది ఎలా చదవాలి అని. మూడోది పక్కన పెట్టి మొదటి రెండు వాటి  మీద focus చేద్దాం. ఎందుకంటే ఇది Beginner సిరీస్  కాబట్టి అండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే... నేను కూడా మరీ senior aspirant ని అయితే కాదు కాబట్టి నాకు తెల్సినంత వరకు నేను ఏమి చేస్తానో, ఎలా చేస్తానో, లేకపోతే ఎలా చేసానో, ఎందుకు ఆలా చేసానో,ఎందుకు ఆలా చేసి తప్పు చేసానో ఇవి మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. మీలో ఎవరికైనా ఇవి తప్పు అని అనిపిస్తే గుర్తుంచుకోండి ఇది నేను ఫాలో అయ్యే strategy. ఎక్కడ కూడా ఇలా మాత్రమే చెయ్యండి అని mention చేయట్లా The First Step మీరు UPSC కి ప్రిపేర్ అవుదాం అని decision తీసుకున్న తరువాత చెయ్యవలసిన మొదటి పని Exam Pattern and Syllabus along with Eligiblity Criteria  గురించి బేసిక్ knowledge సంపాదించుకోవడం.నా Instagram Stud

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Intro)

 చిన్నప్పుడు టీచర్ మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగినప్పుడు కచ్చితంగా మీలో ఒకరు చెప్పిన సమాధానం ఐఏఎస్ లేదా పోలీస్ . కొంతమందికి కాలం తో పాటు కలలు  కూడా మారుతుంటాయి కాని కొంతమందికి చిన్నప్పుడు కన్న కలలు నిజం చెయ్యాలన్న పట్టుదల వయసు తో పటు పెరుగుద్ది. అలాంటి వారు వారి కలలు నిజం చేసుకునే ప్రయత్నం లో ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని తెలీక ఎవరిని అడగాలో తెలీక చాలా సమయం  వృథా చేస్తూ ఉంటారు.వారిలో నేను ఒకరిని.కాబట్టే నాలా ఇంకొకరు వారి సమయం వృథా చెయ్యకూడదు అనే ప్రయత్నం లో నేను ఒక సంవత్సరం పాటు తెలుసుకున్న విషయాల్ని ఇక్కడ వ్రాస్తున్నా.  మీ యొక్క సందేహాలను నిస్సందేహం గా ఇక్కడ అడగొచ్చు. ఈ బ్లాగ్ పోస్ట్ లో ఉండే " ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu "  అనే సిరీస్ పోస్టులకి short summary ఈ వీడియో. Tanmayi Reads  ఛానల్ ని subscribe చేసి వీడియోస్ చూస్తూ ఉండండి ఈలోపు కొత్త పోస్ట్ లతో మీ ముందుకు వస్తాను.